'నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా' లో ఎడ్మిషన్స్ ప్రకటన

updated: May 10, 2018 12:24 IST

నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కు చెందిన స్వయంప్రతిపత్తి గల సంస్థ. సంగీత నాటక అకాడమీ చే 1959 లో స్థాపించబడిన ఈ రంగస్థల శిక్షణ సంస్థ స్వంత నిర్ణయాధికారం గల విశ్వవిద్యాలయం. ఈ స్కూల్ లో బెంగుళూరు శాఖకు సంభందించి నటనలో  ఒక సంవత్సరం కోర్సు ఇంటెన్సివ్‌ కోర్సు2018-19   చేరటానికి నోటిఫికేషన్ వెలవడింది. 

ఇందులో చేరడానికి దేశవ్యాప్తంగా ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ దక్షిణాదిరాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కేరళ మరియు కేంద్రపాలిత ప్రాంతాలుపుదుచ్చేరి, లక్షద్వీప్‌ అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. 

కోర్సు పేరు: డ్రామా ఇంటెన్సివ్‌ కోర్సు 2018-19

సీట్ల సంఖ్య: 20

కోర్సు ప్రారంభం: 25జూలై, 2018

అర్హతలు:

ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత. గిరిజన,జానపద, సంప్రదాయ పెర్‌ఫార్మింగ్‌ ఆర్‌ట కుటుంబాల నుంచి వచ్చే అసాధారణ ప్రతిభగల అభ్యర్థులకు విద్యార్హత మినహాయింపు కనీసం నాలుగు సార్లు ప్రొడక్షన్‌లో పాల్గొనడం తోపాటు థియేటర్‌లో తగిన పరిజ్ఞానం ఉండాలి.

వయస్సు: 2018 జూన్‌1 నాటికి కనీసం 21 సంవత్సరాలు, గరిష్టం 30 సంవత్సరాలు

బోధనమాధ్యమం: ఇంగ్లిష్‌ (పెర్‌ఫార్మెన్స్‌ అన్ని భాషల్లో ఉంటుంది)

పరీక్ష మాధ్యమం: ఇంగ్లిష్‌ లేదా ఏదైనా దక్షిణ భారత భాష.

ఎంపిక విధానం: ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. మొదటగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పాసైన వారు జులై 2-4 వరకు బెంగళూరులో నిర్వహించే వర్క్‌షాప్‌కు హాజరుకావాలి.

ఫిజికల్‌ ఫిట్‌నెస్‌: ఎంపికైన అభ్యర్థులకు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహిస్తారు. 

దరఖాస్తు విధానం: దరఖాస్తు ఫారాలను వెబ్‌సైట్‌లో నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు లేదా ఎన్‌ఎస్‌డి బెంగళూరు సెంటర్‌ లో లభిస్తాయి. బెంగళూరు చాప్టర్‌ పేరున రూ.150/- డీడీ తీసి నిర్దేశిత ధ్రువపత్రాలు జతచేసిదరఖాస్తును కింద తెలిపిన చిరునామాకు పోస్టు ద్వారా లేదా స్వయంగా కాని పంపవచ్చు.

చిరునామా: Camp Director, NSD, Bengaluru Centre, Kalagrama, Mallathalli (Behind Bangalore University), Bangalore-56. 

  స్కాలర్‌ షిప్‌: ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి నెలకు రూ. 4500/- స్కాలర్‌షిప్‌ ఇస్తారు. 

దర ఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్‌ 30 

దరఖాస్తులకు చివరి తేది: 20 జూన్‌ 2018

కోర్స్ ప్రారంభ  తేది: 25 జూన్‌ 2018

ఇరవై సీట్లు మాత్రమే ఉంటాయి.

మిగతా వివరాలకు ...

080-2318-3027/ లేదా  e-mail: nsd.bengaluruchapter@gmail.com.లో సంప్రదించాలి

వెబ్‌సైట్‌:www.nsd.gov.in


Tags: national school of drama

comments