సెల్యూట్‌ అమ్మా...నీ గొప్పతనం పొగడటానికి మాటలు సరిపోవు

updated: February 25, 2018 19:58 IST
సెల్యూట్‌ అమ్మా...నీ గొప్పతనం పొగడటానికి  మాటలు సరిపోవు

వృత్తి ధర్మం అన్నిటికన్నా గొప్పది. ఇది అందరూ చెప్పేదే. అయితే   దీన్ని మనం మాటలు వరకూ తీసుకుంటాం. కానీ ఆమె మనస్సులోకి తీసుకుని అమలు పరిచింది. వ్యక్తిగత జీవితంలో తీరని కష్టం ఎదురైనా..కన్నీటిని దిగమింగుకుని వృత్తి ధర్మానికే ఓటేసింది. అందుకే యావత్ భారతం ఆమెకు ఇప్పుడు సెల్యూట్ చేస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రపంచం ఆమెకు జేజే లు కొడుతోంది. 

 

పూర్తి వివరాల్లోకి వెళితే...   ఈ నెల 15న అసోంలో ఐఏఎఫ్‌కు చెందిన మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్ కూలిపోయింది. ఈ ఘటనలో డి.వాట్స్ అనే పైలెట్ చనిపోయారు. ల్యాండ్ చేసే సమయంలో క్రాఫ్ట్ అదుపుతప్పి ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. అయితే వాట్స్ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో నిర్వహించారు. వాట్స్ భార్య కుముద్ దోగ్రా కూడా సైన్యంలో మేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

 

భర్త చనిపోయాక ఆమెకు పాప పుట్టింది. ఓ వైపు భర్త మరణంతో విషాదం... ఇటు పాప పుట్టింది. ఆమె బాధతో కుంగిపోలేదు. కన్నీళ్లను దిగమింగుకొని యూనిఫాంతో... ఐదు నెలల కూతుర్ని తీసుకొని అంత్యక్రియలకు హాజరయ్యింది. తన భర్తకునివాళులర్పించి... మార్చ్‌ఫాస్ట్‌లో కూడా పాల్గొంది. భర్త మరణాన్ని దిగమింగుకొని ఆమె తన విధుల పట్ల చూపించిన నిబద్ధతను అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు మేజర్‌ దోగ్రాకు సెల్యూట్‌ చేస్తున్నారు.

బిడ్డను ఎత్తుకొని వెళ్తున్న ఆమె ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. నెటిజన్లు ఆమెను అభినందిస్తూ సెల్యూట్‌ చేస్తున్నారు. ఆర్మీని తక్కువ చేసి చూపించే వాళ్లు ఈ సన్నివేశాన్ని చూసైనా వాళ్ల విధులు పట్ల చూపించే  నిబద్దత ఎంత గొప్పగా ఉంటుందో అర్థం చేసుకోవాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

comments